చెవి పోటు సమస్య తలెత్తినప్పుడు ఆ బాధ వర్ణానాతీతం. చెవి మనలో వినికిడి శక్తిని పెంపొందించే అతి సున్నితమైన అవయవం కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. చెవి సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు ఏమాత్రం అజాగ్రత్త పాటించిన జీవితాంతం వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. జ్ఞానేంద్రియాల్లో ఒకటైన చెవికి వర్షకాలంలో వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణమే. అయితే వైరల్ ఇన్ఫెక్షన్లతో ప్రమాదం ఏమీ ఉండదు వాటంతకుడవే తగ్గిపోతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మాత్రం చికిత్స తప్పనిసరి లేకుంటే భవిష్యత్తులో చెవి సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.
సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తరచూ జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని ఫలితంగా చెవిలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్‌కు అవకాశం ఎక్కువగా ఉంటుంది.ముక్కునుంచి చెవికి యుస్టేషన్ ట్యూబ్స్ అనే రెండు గొట్టాలు అనుసంధానమై ఉంటాయి. జలుబు చేసినప్పుడు ముక్కు వెనుక ఉన్న యుస్టేషన్ ట్యూబ్ గుండా ఇన్‌ఫెక్షన్ మధ్యచెవికి విస్తరిస్తుంది. దీనివల్ల చెవిలో చీము చేరి మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. సరిగ్గా వినిపించదు, తీవ్రమైన చెవిపోటు సమస్య తలెత్తుతుంది.
దీర్ఘకాలిక సమస్యలైనా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, టిబి వంటి లక్షణాలతో బాధపడేవారిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా అధికంగానే ఉంటది. మీరు తప్పనిసరిగా సొంత వైద్యం మానుకొని వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.
వర్షంలో తడిచినప్పుడు లేదా స్నానం చేసినప్పుడు చెవిలో నీరు చేరి అస్పర్‌జిల్లస్ నైగర్,కాండిడా అల్బిక్యాన్ అనే ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదకరమైనవి సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే వినికిడి శక్తి తగ్గి అనేక చెవి సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో చెవిలో నీరు చేరకుండా జాగ్రత పడాలి.