అతి బరువు సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే… ఈ ఆహార పదార్థాలతో సమస్యకు చెక్ పెట్టండి!

క్రమ పద్ధతి లేని జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా దాదాపు నూటికి 40 శాతం మంది అధిక బరువు, ఉబకాయ సమస్యతో నిత్యం తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. దీని ఫలితంగా భవిష్యత్తులో డయాబెటిస్, హార్డ్ స్ట్రోక్, రక్తపోటు, అల్జీమర్, కీళ్లనొప్పులు వంటి అనేక సమస్యలతో జీవితాంతం పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్ ఉపయోగించి అలసిపోయారా ! అయితే ఇప్పుడు చెప్పబోయే సహజమైన చిట్కాను ఉపయోగించి సునాయాసంగా సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

అధిక శరీర బరువును నియంత్రించుకోవడానికి ఉదయం అల్పాహారం తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సహజ పద్ధతిలో శరీర బరువు నియంత్రించుకోవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ టీ వంటి పానీయాన్ని సేవించడానికి బదులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గ్రీన్ టీ ని సేవిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో గోధుమలు, జొన్న, రాగి వంటి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే వీటిల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలను పెరగనివ్వకుండా సహాయపడతాయి.

మనందరం అనుకున్నట్టుగా ప్రతిరోజు గుడ్డును ఆరంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది అనడంలో ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు గుడ్డును ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే సహజ పోషక పదార్థాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే అత్యధిక ఫైబర్ కలిగిన అరటిపండు, కివి, పైనాపిల్, ద్రాక్ష వంటి పండ్లను రోజువారి అల్పాహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.