బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా…. ఇందులో నిజం ఎంత నిపుణులు ఏమంటున్నారంటే?

సాధారణంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనకు తెలిసిందే. అయితే బీర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది బీర్ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు.అయితే బీర్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే కానీ పరిమితికి మించి తాగినప్పుడే ఈ ప్రయోజనాలు అందుతాయి లేదంటే బీర్ తాగడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది కిడ్నీలో రాళ్లు కనుక ఉంటే బీర్ అధికంగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని భావిస్తూ ఎక్కువగా బీర్ తాగుతూ ఉంటారు.

 

నిజంగానే బీర్ ఎక్కువగా తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా ఇందులో ఎంతవరకు నిజముంది… నిపుణులు ఈ విషయంపై ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే… బీర్ ఎక్కువగా తాగటం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్తూ ఉండడంతో కిడ్నీలో ఉన్నటువంటి రాయి బయటకు పడిపోతుందని చాలామంది భావిస్తారు. అయితే ఇది పూర్తిగా ఆ వాస్తవమని ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.

 

బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పడిపోతాయన్న భ్రమలో చాలామంది బీర్ ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే వాళ్లు మరి కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు తెలియజేశారు. తరచూ బీరు తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే అధిక రక్తపోటు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కిడ్నీలో రాళ్లు కనక ఉన్నాయని తెలియగానే వైద్యుల సలహా ప్రకారం చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.