రోజు ఒక యాపిల్ తింటున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని లేదు అనే ఒక సామెత ఉంది. ఎన్నో పోషకాలు కలిగినటువంటి యాపిల్ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి ఈ ఆపిల్ వల్ల కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా చెక్ పెట్టవచ్చని తెలుస్తుంది. అయితే ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
యాపిల్ పండు లో అధికంగా ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మధుమేహ సమస్యను మెరుగుపరచడంలో ఎంతో సహాయ పడతాయి.

ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పోరాడానికి కూడా ఈ యాపిల్లో ఉండే ఫైబర్ మనకు చాలా సహాయపడుతుంది. ఇక తరచూ యాపిల్స్ తినడం వల్ల మన శరీర బరువు తగ్గించడానికి మరింత సహాయపడతాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ యాపిల్ సహాయపడుతుంది. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తుల్లో జరిగే ఆక్సీకరణ నష్టాన్ని నివారించవచ్చు.

ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక యాపిల్ మీ రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వలన అలర్జీ, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలను మెరుగుపరచడంలో మరింత సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక ఇందులో ఉన్న ఫైబర్ మన జీవక్రియ రేటును పెంచడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది.అందుకే ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.