నిమ్మ పండు రుచికి పులుపే అయినప్పటికీ మన నిండు జీవితానికి సరిపడా పోషకాలను అందించి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో మాత్రం ముందుంటుంది. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ పండ్లను విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కావున ప్రతిరోజు నిమ్మ పండు రసాన్ని ఉదయాన్నే సేవిస్తే మన ఆరోగ్యానికి హాని కలిగించే సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా వైరస్లను అదుపు చేసే ఇమ్యూనిటీ సిస్టం మనలో అభివృద్ధి చేస్తుంది.
ప్రతిరోజు కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీ వంటి వాటికి బదులు ఎన్నో ఔషధ గుణాలున్న లెమన్ టీ ని ప్రతిరోజు సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. లెమన్ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట గోరువెచ్చని నీళ్లలో నిమ్మ రసాన్ని పిండుకొని అందులో రుచి కోస ఎక్కువమంది చక్కర వేసుకుంటుంటారు. చక్కర కి బదులు తేనెను వేసుకుంటే మరిన్ని ఔషధ గుణాలు లభిస్తాయి. తర్వాత సువాసన కోసం అద్భుత ఔషధ గుణాలు కలిగిన పుదీనా, తులసి ఆకులను కూడా లెమన్ టీలో వేసుకుంటే రుచికరమైన సువాసన కలిగిన లెమన్ టీ తయారైనట్లే.
ప్రతిరోజు ఉదయాన్నే లెమన్ టీ నీ సేవిస్తే వీటిలోని ఔషధ గుణాలు మన శరీరంలోని వ్యర్ధాలను తొలగించి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. లెమన్ టీ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఇవి మన శరీరంలోని వ్యాధి కారక క్రిములను నశింపజేసి తరచూ ఇబ్బంది పెట్టె గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఆందోళన, చికాకు, ఒత్తిడి వంటి మానసిక శారీరక సమస్యలను అదుపు చేయడంలో లెమన్ టీ దివ్య ఔషధంలా పనిచేస్తుంది లెమన్ టీ లో పుష్కలంగా లభించే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు లెమన్ టీ ని సేవిస్తే సుఖ విరోచనాలు జరుగుతాయి. నిమ్మకాయలోని సహజ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడి రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది.