ఆవలించడం సహజమైన విషయం అని అందరూ భావిస్తారు.. అయితే తరచుగా ఆవలింతలు వస్తే ఇది సాధారణ విషయం అనుకోవద్దని నిపుణులు అంటున్నారు. పని ఒత్తిడి, విసుగు, నిద్రాలేమి ఇవన్నీ ఆవలింతకు సాధారణ కారణాలే. కానీ ఆవలింతలు ఆపకుండా వస్తుంటే..? ఒక్కసారి ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. ఒకరికి రోజుకు 10 సార్లు ఆవలిస్తే అది సాధారణమైన విషయం.. కాని కొందరికి రోజంతా కనీసం 100 సార్లైనా ఆవలింతలు వస్తుంటి.. కొందరికి 5 నిమిషాల్లో 3–4 సార్లు ఆవలింతలు వస్తాయి. ఇవి సాధారణం అయ్యే వరకు బాగానే ఉంది. కానీ ఆవలింతల సంఖ్య కంట్రోల్‌కి మించి ఉంటే అది లోపలి సమస్యల సంకేతం కూడా కావచ్చు. ముఖ్యంగా నిద్రలేమి, ఆక్సిజన్ సరఫరా లోపం, మందుల సైడ్ ఎఫెక్ట్‌లు, విసుగు వంటివి సాధారణ కారణాలు. కానీ కొన్ని వ్యాధులు కూడా ఆవలింతలకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండెకి ఎటెన్షన్: గుండెపోటు (హార్ట్ ఎటాక్) సమయంలో శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువవుతుంది. దాంతో ఎక్కువగా ఆవలింతలు రావచ్చు. అయితే ఒక్క ఆవలింతతోనే హార్ట్ ఎటాక్ అని భయపడాల్సిన పనిలేదు. కానీ ఇతర లక్షణాలు కూడా ఉంటే మాత్రం జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు.. అంటే హైపోగ్లైసీమియా మొదలవుతున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. ఒక్కసారిగా ఎక్కువగా ఆవలిస్తే షుగర్ పరీక్ష చేసుకోవడమే మంచిది.
నిద్ర సమస్యలకు సంకేతం: తరచూ ఆవలించడం నిద్రలేమి (ఇన్సోమ్నియా) లేదా స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు కావచ్చు. స్లీప్ ఆప్నియా ఉన్నవారికి రాత్రంతా తేలికగా నిద్ర పట్టదు, శ్వాస ఆగిపో యినట్లు అనిపిస్తుంది. ఉదయాన్నే అలసటగా లేచేవారికి ఇది ఉందో లేదో తెలుసుకోవాలి. సరైన వైద్య సలహా తీసుకోవాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఆవలింత ఒక చిన్న సహజ చర్యే కాబట్టి విస్మరించకండి. తరచూ వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.