డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మునగకాయను ఆహారంగా తినొచ్చా.? తింటే ఏమవుతుంది?

మునగకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే. మునగ చెట్టులోని ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉండడంతో కొన్ని ఏళ్లుగా ఆయుర్వేదంలో ఎన్నో రకాల వ్యాధులకు పరిష్కార మార్గంగా ఉపయోగిస్తున్నారు. మునగకాయ అద్భుతమైన రుచితో పాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. అయితే చాలామందికి మునగకాయను తినే విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మునక్కాయను తింటే శరీరంలో వేడి పెరుగుతుందని తద్వారా డిహైడ్రేషన్ సమస్య తలెత్తి అవయవాల పనితీరులో వ్యత్యాసం ఏర్పడి జీవ నియంత్రణ దెబ్బతింటుందని చెబుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే తరుచూ మునక్కాయను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు మునక్కాయను తినడానికి ఆలోచిస్తుంటారు. కారణం మునక్కాయ తింటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇందులో ఏ మాత్రం నిజం లేదు మునగ ఆకు మరియు మునగ కాయలో సమృద్ధిగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, డెంటరి ఫైబర్ పుష్కలంగా ఉన్నందున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.అధిక రక్తపోటు ఉన్న రోగులకు మునక్కాయ చాలా మేలు చేస్తుంది. మునగలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను శుభ్రం చేయడమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు వారంలో మూడు లేదా నాలుగు సార్లు మునక్కాయను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే ఐరన్, ఫోలిక్ ఆమ్లం,విటమిన్ బి12 హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మునగలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లయటరి గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి వ్యాధి కారకాలను నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండె ఆయుషుని పెంచుతుంది.