రక్తహీనత సమస్యకు చెక్ పెట్టాలంటే కరివేపాకుతో ఇలా ప్రయత్నించండి!

ప్రతిరోజు వంటకాల్లో సువాసన కోసం ఉపయోగించే కరివేపాకులో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున మనం తినేటప్పుడు కూరల్లో కనిపించే కరివేపాకును తీసి పక్కన పడేయకుండా అలాగే తినడం మంచిది. లేకపోతే కరివేపాకు ఆయిల్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

మీరు ప్రతి రోజు ఉపయోగించే ఏదైనా శుద్ధమైన వంట నూనెలో తాజా కరివేపాకు ఆకులను వేసుకొని కొన్ని రోజులు నిల్వ ఉంచినట్లయితే కరివేపాకు లోని పోషకాలు,ఔషధ గుణాలు వంట నూనెలో కలిసిపోతాయి.ఇలా కలిసిపోయిన వంటనూనె రోజువారి వంటకాల తయారీలో ఉపయోగిస్తే కరివేపాకులోని ఔషధ గుణాలను సంపూర్ణంగా పొందవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కరివేపాకు లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నియంత్రించి అన్ని రకాల క్యాన్సర్ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

మధుమేహ వ్యాధితో బాధపడేవారు కరివేపాకు లేదా కరివేపాకు ఆయిల్ ప్రతిరోజు ఆహారంలో వినియోగిస్తే ఇన్సులిన్ ఉత్పత్తిలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నిరంతరంలో ఉంచుతాయి.ముఖ్యంగా కరివేపాకు ఆయిల్ సమృద్ధిగా లభించే ఐరన్, ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కావున కంటి చూపు మెరుగుపడి వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను తొలగించుకోవచ్చు.విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. కరివేపాకులో లభించే కాల్షియం, ఫాస్పరస్ ఎముకల దృఢత్వానికి సహాయపడి కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.