రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారా.. సమస్యకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

anemia_header

ఈ మధ్య కాలంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఎక్కువమందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. చిన్న సమస్యే అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రక్తహీనత సమస్యతో బాధ పడితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. తరచూ అలసటగా అనిపిస్తున్నా, చిన్న పనులు చేసినా ఆయాసం వస్తున్నా రక్తహీనత సమస్య రీజన్ అయ్యే ఛాన్స్ ఉంది.

రక్తహీనత సమస్య వల్ల బలహీనం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ బీట్ రూట్ రసాన్ని తాగడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ సమస్య సులువుగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మహిళలకు రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం వల్ల కూడా రక్త హీనత సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి ఆరోగ్య సమస్యలు సైతం రక్తహీనతకు కారణమని చెప్పవచ్చు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. గుండె వేగం పెరుగుతున్నా కూడా రక్తహీనత సమస్య కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంది.

తరచూ శ్వాస సంబంధిత సమస్యలు వేధిస్తున్నా రక్త హీనత కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలను ఈ సమస్య ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది. రక్తహీనత సమస్య వల్ల దేశంలో ఎంతోమంది బాధ పడుతున్నారు.