చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చాయా…. ఎర్ర కలబందతో సమస్యకు చెక్ పెట్టండి!

aloe

మన ఇంటి పరిసర ప్రాంతాలలో పెరిగే కలబంద ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మనందరికీ ఈ మొక్కలో ఉన్న సుగుణాల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొంది ఎంతో ప్రత్యేకంగా కనిపించే రెడ్ అలోవెరా మొక్కలో సాధారణ కలబంద మొక్క కంటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర కలబంద మొక్కలో
శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, అమినోయాసిడ్స్ , పాలీశాకరైడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీబయోటిన్ గుణాలు సమృద్దిగా లభిస్తాయి

ఇలా ఎర్రని కలబంద గుజ్జులో ఉన్నటువంటి పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్యాన్ని మెరుగుపరచడంలో వీటి పాత్ర కీలకమనే చెప్పొచ్చు. చర్మం పై ముడతలు, వృద్ధాప్య లక్షణాలతో బాధపడేవారు వారంలో మూడుసార్లు కలబంద గుజ్జుతో ఫేషియల్ చేసుకుంటే కలబందలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మ కణాలకు నూతన శక్తిని పెంపొందించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా తరిమికొడుతుంది.

రెడ్ అలోవెరా గుజ్జులో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ముఖంపై వచ్చే మొటిమలు, నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే కలబంద గుజ్జుతో కొబ్బరి నూనెను కలిపి తల చర్మానికి జుట్టు కుదురులకు అంటే విధంగా మర్దన చేసుకుంటే గుజ్జులో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు అందాన్ని, రెట్టింపు చేయడంలో సహాయపడతాయి.