డయాబెటిస్ రోగులకు అద్భుత ఔషధమిదే!.. ఈ పంటతో రైతుల కష్టాలు తీరతాయట!

stevia-29141

దేశంలోని యువతలో చాలామంది ఉద్యోగం కంటే ఇతర రంగాలలో సక్సెస్ సాధించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుత కాలంలో ఔషధ మొక్కలను పెంచడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తులసి, కలబంద లాంటి పంటలు తక్కువ సమయంలో మంచి ఆదాయం అందిస్తున్నాయి.

ఎక్కువ డిమాండ్ ఉండే ఈ పంటలు సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ పొలం ఉన్నవాళ్లు తక్కువ స్థలంలో కూడా పంటలను సాగు చేసి ఊహించని స్థాయిలో సంపాదించవచ్చు. డిమాండ్ కు అనుగుణంగా ఔషధ మొక్కల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే మాత్రం ఆదాయం భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు.

స్టీవీయా పంట సాగు చేయడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతమవుతోంది. షుగర్ మందుల తయారీలో స్టీవియాను వినియోగించడం జరుగుతుంది. చక్కెరతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉండే స్టీవియా పంటను అతి తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు. బెంగళూరు, పూణేతో పాటు పలు నగరాలలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది.

ఈ పంట ఎకరా సాగుకు లక్ష రూపాయలు ఖర్చు అయితే 5 నుంచి 6 లక్షల రూపాయల లాభం వస్తుంది. ఔషధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఈ పంటను సాగు చేస్తే మాత్రం ఊహించని స్థాయిలో ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది.