మనలో చాలామంది పట్టణ జీవనానికి అలవాటు ప్రతి పనిలోనూ టెక్నాలజీ పెరిగిపోవడం మనుషుల్లో
శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం,గుండెసంబంధ వ్యాధులు వస్తున్నాయని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
ప్రజలు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సహజ పోషకాలు,పీచు పదార్థం సమృద్ధిగా ఉన్న చిరుధాన్యాలను చేర్చుకోవాలని సూచించడం జరిగింది.
చిరుధాన్యాల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి కొర్రలు, జొన్నలు,సజ్జలు, రాగులు, ఊదలు, సామలు, ఆరికలు వీటిలో ఉండే సహజ పీచు పదార్థం వల్ల తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలిసిపోకుండా అవసరమైన మేరకు మాత్రమే కొద్దికొద్దిగా రక్తంలో కలుస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అదే మనం రోజు తినే బియ్యంలో పీచు పదార్థం లేకపోవడంతో గ్లూకోజ్ అధిక మొత్తంలో ఒకేసారి రక్తంలో కలుస్తుంది దాంతో డయాబెటిస్ అదుపు తప్పుతుంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే వారిలో పోషకాహార లోపం తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ముఖ్యంగా చిరుధాన్యాల్లో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తోపాటు అత్యధికంగా పీచుపదార్థం ఉంటుంది.పీచుపదార్థం వల్ల తిన్న ఆహారం కొద్దికొద్దిగా మాత్రమే గ్లూకోజ్‌గా మారుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వలు మొత్తంలో ఒకేసారి చేరదు కాబట్టి దాంతో డయాబెటిస్, రక్త పోటు ఎల్లప్పుడు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉన్నందున ఊబకాయం,శరీర బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, అలసట నీరసం, ఆందోళన, మూత్రం ఇన్ఫెక్షన్, అతిమూత్ర వ్యాధి, కిడ్నీ దెబ్బతినడం, గాయాలు త్వరగా మారకపోవడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ముప్పు తగ్గుతుంది. అందువల్లే చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో తీసుకోవడానికి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.