శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులకు పొంచి ఉన్న కొత్తరకం ఫంగస్ ముప్పు?

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మ జీవులు మన ఇమ్యూనిటీ సిస్టం పై దాడి చేసి అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రాణాంతక సూక్ష్మజీవులు రోజురోజుకు బలంగా తయారై వీటిని అదుపు చేసే చికిత్సలో వాడే యాంటీ బయోటెక్ మందులకు కూడా లొంగని విధంగా తయారవుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య సంస్థలు మందులను తయారు చేసినప్పటికీ రోజురోజుకు కొత్తగా వస్తున్న వ్యాధికారక సూక్ష్మజీవులు అదుపు చేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కష్టతరంగా మారుతోంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రమాదకర ఫంగస్ జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా క్యాన్సర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస కోశ వ్యాధులు, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ ఫంగస్ కారణంగా వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున వీటిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. ప్రస్తుతం మనకు నాలుగు రకాల యాంటీ ఫంగల్ మందులు అందుబాటులో ఉన్నాయి మరికొన్ని ప్రయోగదశలో ఉన్నందున వీటిని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆరోగ్య సంస్థలకు సూచించడం జరిగింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం నాలుగు రకాల ఫంగస్లను అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ జాబితాలో చేర్చడం జరిగింది. క్యాండీడ అరిస్ అనే ఫంగస్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో కరోనా సమయంలో ఎక్కువగా వాడిన శ్వాస కోసం వేసే గొట్టాల్లో బాగా వృద్ధి చెంది అత్యంత ప్రమాదకరంగా మారింది. క్యాండీడ అల్బీకాన్ అనే ఫంగస్ గొంతు, ముక్కు ఇన్ఫెక్షన్కు కారణం అవుతుంది. క్రిస్టోకార్స్ ఫోర్స్ మాన్ అనే ఫంగస్ శ్వాస నాళాల ద్వారా లోపలికి వెళ్లి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అస్పెర్ గిల్లస్ అనే ఫంగస్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.