ఖర్చు దండగ తప్ప ఫేక్ సర్వేలతో ప్రయోజనమేంటి.?

వైసీపీ చేయించుకుంటోందా.? వైసీపీ అధినాయకత్వం మెప్పు కోసం ఆయా సర్వేలు చేయించబడుతున్నాయా.? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.?

‘టైమ్స్’ సర్వే ప్రతిసారీ, ఒకటే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైసీపీనే క్లీన్ స్వీప్ చేస్తుందని. మొత్తంగా 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైసీపీకే వస్తాయన్నది ఆ సంస్థ చేస్తున్న సర్వేల ఫలితం.

ఇది చేస్తున్న సర్వే కాదు, చేయిస్తున్న సర్వే అని చిన్న పిల్లాడికైనా అర్థమయిపోతుంది. ఎందుకంటే, ప్రతిసారీ ఒకటే రిజల్ట్.! రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఖచ్చితంగా వుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కొంత నీరసించిన మాట వాస్తవం. కానీ, అంతలోనే పుంజుకుంది.

ఇక, జనసేన పార్టీ కూడా రోజురోజుకీ బలోపేతమవుతోంది. టైమ్స్ సంస్థ సర్వే ప్రకారమే చూసుకున్నా, జనసేన పార్టీకి 10 శాతం ఓటు బ్యాంకు కనిపిస్తోంది. ప్రతిపక్షం తెలుగుదేశం కూడా 37 శాతానికి పైగా ఓటు బ్యాంకు దక్కించుకోగలదన్నది టైమ్స్ సర్వే సారాంశం.

అధికార వైసీపీకి మాత్రం 51 శాతం ఓటు బ్యాంకుని టైమ్స్ సంస్థ కట్టబెడుతోంది. టీడీపీ – జనసేన కలిస్తే, 47 శాతం అనుకోవాలి.! అయితే, రాజకీయాల్లో ఒక్కోసారి ప్లస్సూ.. ప్లస్సూ కలిస్తే మైనస్సూ అవ్వొచ్చు. తెలుగునాట రాజకీయాలు వేరు. టీడీపీ – జనసేన కలిస్తే, 55 శాతానికి పైగా ఓటు బ్యాంకు అవ్వొచ్చు. అదే సమయంలో, వైసీపీ పతనం అనూహ్యంగా వుంటుంది.

వైసీపీనే, తమ అభ్యర్థుల్ని మార్చుకుంటోందంటే, ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో వైసీపీకే అర్థమవుతోంది కదా.! మరి, వైసీపీ కోసం చేయిస్తున్న సర్వేల్లో ఈ ఫేక్ లెక్కలేంటి.? ఇవి వైసీపీనే దెబ్బ తీస్తాయ్.! వైసీపీ నేతలే, టైమ్స్ సర్వేని నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఈ సర్వేల్ని వైసీపీ చేయిస్తే గనుక, ఖర్చు దండగ తప్ప ఉపయోగం లేదు.