భాగ్యనగరంలో మాయమైన చెరువులు ఇవే

ఓసారి ఈ చెరువుల పేర్లన్నీ చదవండి. ఒకప్పుడు ఈ చెరువుల్లో నీళ్లుండేవి. అవి మాయ అవడంతో ఆ నీళ్లన్నీ రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ లో పూర్తిగా కనిపించకుండా పోయిన చెరువుల జాబితా ఇది.

మీరాళం చెరువు
తలబ్ కట్ట చెరువు
మంత్రాల చెరువు
కొత్త చెరువు
ఐడీపీఎల్ చెరువు
హస్మత్‌పుర చెరువు
బాలాజీనగర్ చెరువు
కౌకూర్ చెరువు
సూరారం చెరువు
లింగంచెరువు
వెన్నెలగడ్డ చెరువు
ప్రగతినగర్ చెరువు
కాప్రా చెరువు
కీసర చెరువు
పూడురు చెరువు
ఎల్లమ్మపేట చెరువు
మేకంపూర్ చెరువు
నల్లచెరువు
పల్లె చెరువు
దుర్గం చెరువు
రామంతపూర్ చెరువు
సఫీల్ గూడ చెరువు
అల్వాల్ చెరువు
సరూర్ నగర్ చెరువు
అమీనాపూర్ చెరువు
జీడిమెట్ల చెరువు
బంజారా చెరువు (బంజారాహిల్స్)
షామీర్ పేట్ చెరువు
నారాయణరెడ్డి కత్వా
బాచారం కత్వా
హీరా కత్వా
రాయిన్‌చెరువు
మాలోనికుంట
అంట్ల మాసమ్మకుంట
మైసమ్మ చెరువు
పెద్ద చెక్‌ డ్యాం
మెట్టు కత్వా
బుంగ కత్వా
బూబాగడ్డ చెక్‌ డ్యాం
ఎర్రబండ చెక్‌డ్యాం
బంధంకుంట
బైరాంఖాన్‌ చెరువు

ఈదులచెరువు
దిల్‌వార్‌ఖాన్‌ చెరువు
పోల్కమ్మ చెరువు
అంతాయపల్లి చెరువు
కుంట్లూర్‌ చెరువు
కంబాలకుంట
మాసబ్‌ చెరువు
వడ్లకుంట
కొత్త చెరువు
బందకుంట
అమీర్‌పేట
యూసుఫ్‌గూడ చెరువు
శ్యామలకుంట సనత్‌నగర్‌
మైసమ్మకుంట
చాపల చెరువు
తుమ్మల కుంట
చింతలకుంట
పుప్పలకుంట
కూర్మ చెరువు
కుత్బుల్లాపూర్‌ చెరువు
కోమ కుంట
కోమార్‌కుంట
గొల్లవాని కుంట
భజన్‌సాహికుంట
బొంగలకుంట
షాన్‌ కీసమున కుంట
హెచ్‌ఎంటి కాలనీ చెరువు
క్వారీ కుంట
క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరువు
బండకుంట
సుదర్శన్‌ చెరువు

చినుకుపడితే చాలు హైదరాబాద్ చిత్తడి చిత్తడి అవుతుంది. బోరును వర్షం పడితే ఇక అంతే సంగతులు…. ఇటీవలి వర్షాలకు అయితే ఏకంగా పడవలు వేసుకొని ప్రయాణించాల్సిన దుస్థితి వచ్చింది. అదే మామూలు రోజుల్లో అయితే హైదరాబాద్ ఓ మహా నగరం. కేసీఆర్ సర్కారు వరల్డ్ క్లాస్ సిటీ అని ప్రచారం చేసుకుంటున్నా ఓ కాస్మోపాలిటన్ సిటీకి ఏ మాత్రం తీసిపోదు. కాని చినుకు పడితే మాత్రం చిత్తడి చిత్తడి అవుతోంది. మనం హైదరాబాద్ గురించి చెప్పుకోవాలంటే వర్షానికి ముందువర్షానికి తర్వాత అని మాట్లాడుకాల్సిన దుస్థితి వచ్చింది.

వరదలు వచ్చినా తట్టుకునే విధంగా ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకోకపోవడమే ఇందుకు కారణం.
అప్పట్లో హైదరాబాద్ కోసం మంచి డ్రైనేజ్ సిస్టంతో కూడిన ప్లాన్ గీయమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అడిగితే ఆయన గీసిన ప్లాన్ ప్రకారం… ఉస్మాన్‌సాగర్హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు కట్టించారు. అయితే ఈ రెండు రిజర్వాయర్లు కట్టింది సుమారు 1950లో అప్పట్లో హైదరాబాద్ పరిసరాల్లో సుమారు ఐదు వందల చెరువులు ఉండేవి. కానీ… ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నవి కేవలం 190చెరువులే. మిగిలిన చెరువులన్నీకబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు వాటిల్లో అపార్ట్ మెంట్లు వెలిశాయి. నేతలు కబ్జాలు చేసి భవంతులు కట్టేసి అలా వచ్చిన డబ్బులతో బలవంతులైపోయారు.

పోనీ మిగిలిన 190 చెరువులు అన్నా బాగున్నాయా అంటే అది లేదు. విపరీతంగా పెరిగిపోయిన జనాభా వల్ల అవి కూడా అంతో ఇంతో కబ్జాకు గురయ్యాయి. నీళ్ళు రోడ్ల మీద నిలవ ఉండకుండా… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను నిర్మించాలి. ఆ డ్రైజేజీ సిస్టం నుంచి… ఇప్పుడు వాడకంలో ఉన్న కొన్ని చెరువుల్లోకి నీళ్ళు వెళ్ళేలా ప్లాన్ చేయాలి. అర్బన్ ప్లానింగ్ అట్టర్ ఫ్లాఫ్ అవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని పలువురు నిపుణలు ధ్వజమెత్తుతున్నారు.

మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర సర్కారు చెబుతోంది. మరి చెరువుల పూడకలు పూర్తి అయితే ఇంత నష్టం ఎలా జరుగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో మిషన్ కాకతీయ పని బాగాన ఉన్నా హైదరాబాద్ కు వచ్చే సరికి అనేక సాంకేతిక సమస్యలకు తోడు రాజీకీయ ఒత్తిడుల కారణంగా పనులు సవ్యంగా సాగలేపోయాయని ఆ కారణంగానే ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఏకంగా 8,633 కోట్ల పంటనష్టం, రోడ్లకు రూ. 222 కోట్లు, జీహెచ్ఎంసీకి సుమారు రూ. 567 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 300 కోట్లు , ఇరిగేషన్కు రూ. 50 కోట్లు నష్టం వాటిల్లింది.