Mohan Babu: తుపాకీని సరెండర్‌ చేసిన మోహన్‌బాబు

Mohan Babu : ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో నటుడు మంచు మోహన్‌ బాబు తన లైసెన్స్‌డ్‌ గన్‌ను పోలీసులకు సరెండర్‌ చేశారు. మోహన్‌ బాబు తన పర్సనల్‌ పీఆర్వో ద్వారా డబుల్‌ బ్యారెల్‌ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించిట్లు సమాచారం.

గతకొన్ని రోజులుగా మంచు మోహన్‌ అతడి కుమారుడు మంచు మనోజ్‌లకు మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్‌ బాబు, మంచు మనోజ్‌ బాబు పోలీసులను ఆశ్రయించగా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్‌ చేయమని పోలీసులు ఆదేశించారు.