TG: చంద్రబాబు సీఎం భయపడుతున్న ఇన్వెస్టర్లు..మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!

TG: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఇన్వెస్టర్లు భయపడుతున్నారు అంటూ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీ ఆవరణంలో మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇటీవల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వరదలు రావడంతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తెలిపారు.

నిజం చెప్పాలంటే ఇన్వెస్టర్లు అమరావతి కంటే కూడా హైదరాబాద్ బెంగళూరుకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఈయన తెలిపారు. ఇక తెలంగాణలో ఏ జిల్లాలను కూడా రద్దు చేయలేదని ఈయన తెలియజేశారు. ఇలా జిల్లాలను రద్దు చేసే ఆలోచనలో కూడా తమ ప్రభుత్వం లేదని పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో అసెంబ్లీలో మాట్లాడాలని ఉంది అంటూ పొంగులేటి తెలిపారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో ఆదాయం పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. వైఎస్సార్ సమయంలో కూడా ఇలాగే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణలో వ్యతిరేకత ఉంది అనేది కూడా కేవలం ప్రచారం మాత్రమేనని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.