Kalki–Nag Ashwin: ఆ దేశంలో కల్కి మూవీ రిలీజ్.. ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్.. ఫొటోస్ వైరల్!

Kalki–Nag Ashwin: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులో మోత మోగించింది. కోట్లల్లో కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరో మంచి మార్కెట్ అయినా జపాన్ దేశంలో విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్.

జపాన్ లో కల్కి సినిమా వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని జపాన్ లో మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. అయితే జపాన్ లో కల్కి సినిమా ప్రమోషన్స్ కి డార్లింగ్ ప్రభాస్ కూడా వెళ్లాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల తాజాగా షూటింగ్లో కాలికి గాయం అవడంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే జపాన్ కి వెళ్లారు. ఈ మేరకు అక్కడ సినిమాకు పమోషన్స్ ని మొదలు పెట్టినట్టు ఒక ఫోటోని కూడా షేర్ చేశారు నాగ్ అశ్విన్. జపాన్ కి సంబంధించిన ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ ఫొటోలు, వీడియోలు కల్కి టీమ్ అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

 

ఇకపోతే జపాన్ వాళ్ళు తెలుగు సినిమాలపై తెలుగు సినిమా హీరోల పై ఎంత ప్రేమ చూపిస్తారో గతంలో చాలా సందర్భాలలో రుజువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో పాటు ఈ సినిమా అక్కడ థియేటర్లలో ఏకంగా ఏడాది పాటు ఆడి సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది. అంతలా తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. దీంతో ఇప్పుడు కల్కి మూవీ ని కూడా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.