Sudigali Sudheer: హమ్మయ్య.. ఎట్టకేలకు శుభవార్త చెప్పబోతున్న సుడిగాలి సుధీర్.. ఆ ప్రొడ్యూసర్ కూతురితో వివాహం!

Sudigali Sudheer: టాలీవుడ్ హీరో, కమెడియన్, మెజీషియన్, డాన్సర్ అయినా సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును తెచ్చుకున్న సుధీర్ ఈ షో ద్వారానే తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా భారీగా ఫేమ్ ని సంపాదించుకున్నాడు సుధీర్. ఇక అదే క్రేజ్ తో కొన్ని సినిమాలలో కమెడియన్ గా అవకాశాలను సంపాదించుకుని చిన్న చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలలో కూడా నటించాడు సుధీర్. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

దీంతో సుధీర్ మళ్ళి ఇప్పుడు తిరిగి బుల్లితెర బాట పట్టాడు. బుల్లితెరపై పలు శోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. సుధీర్ అని పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చి మీరు రష్మీ. బుల్లితెరపై వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మీ ఇద్దరికీ పెళ్లి అంటూ కూడా చాలాసార్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరూ ఒక్కటి అయితే చూడాలని లక్షలాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక సుధీర్ పెళ్లి పై ఇప్పటికే కొన్ని వందల వార్తలు వినిపించాయి. సుధీర్ అభిమానులు సుధీర్ విషయంలో ఏ విషయంలోనైనా నిరాశగా ఉన్నారు అంటే అది ఒక పెళ్లి విషయంలో మాత్రమే అని చెప్పాలి.

ఇక సుధీర్ ఎక్కడికి వెళ్లినా కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణలో ఫలించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సుధీర్ గుడ్ న్యూస్ ని చెప్పబోతున్నాడట. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలో సుధీర్ పెళ్లి గురించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు స్పందిస్తూ నిజమా ఈ వార్తలు నిజమైతే ఎంత బాగుంటుందో, మా అభిమాన హీరో ఎప్పుడూ పెళ్లి పీటలు ఎక్కుతాడో అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.