Raaj Saab: ప్రభాస్ రాజాసాబ్ మూవీ వాయిదా.. నిరాశలో అభిమానులు!

Raaja Saab: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్‌. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా అనుకున్న తేదీకి రాద‌ని, వాయిదా ప‌డ‌నుంద‌నే వార్త‌లు ఫిలిం స‌ర్కిల్‌ లో వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫౌజీ సినిమా షూటింగ్‌ లో ప్ర‌భాస్ కాలుకి గాయ‌మైంద‌ని, శ‌స్త్ర‌చికిత్స చేయించుకునేందుకు ఇట‌లీ వెళ్లనున్నాడ‌ని, జ‌న‌వ‌రి చివ‌రి వారంలోనే తిరిగి రానున్నాడ‌ని గ‌త రెండు రోజులుగా ఒక వార్త వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. రాజాసాబ్ అనుకున్న సమ‌యానికి రావ‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల్లో ఇది ఒక కార‌ణ‌మ‌ని అంటున్నారు. దానికి తోడు ఇదే సమయానికి యంగ్ హీరో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్న మూవీ జాక్.

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర విడుద‌ల తేదీని తాజాగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని కూడా స‌రిగ్గా 2025 ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. రాజాసాబ్ వాయిదా ప‌డుతుంద‌నే విష‌యం పై వీరికి క్లారిటీ ఉంద‌ని, అందుక‌నే స‌రిగ్గా అదే రోజున విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పార‌ని అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమా రోజున మ‌రే సినిమాగా విడుద‌ల కాద‌ని, అదే రోజున విడుద‌ల చేస్తామ‌ని చెప్ప‌డం చూస్తుంటే రాజాసాబ్ వాయిదా ప‌డడం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై రాజాసాబ్ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. అయితే ఈ మూవీ విడుదల తేదీ వాయిదా అంటూ వార్తలు వినిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.