Jack: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్న విషయం తెలిసిందే. సిద్దు నటిస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుండడంతో ఈయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సిద్దు జొన్నలగడ్డ. సిద్దు చివరిగా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ సినిమా మరేదో కాదు జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. హ్యారీస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
He’s JACK-ed up and locked in for action 🔥
Cracking a new level of entertainment in cinemas from April 10, 2025. 🤟🏻 #Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial @vamsikaka #SVCC37 #JackTheMovie pic.twitter.com/zI9rKvCjth
— SVCC (@SVCCofficial) December 18, 2024
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరోసారి విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో అనగా 25 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో సిద్దు అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంజనాలను అందుకుంటుందో చూడాలి మరి.
