సరిగ్గా ఆలోచిస్తే… ఈ ప్రశ్న మస్థిష్కంలో మెదలడంలో తప్పు లేదేమో అనిపిస్తుంటుంది! పార్టీ స్థాపించారు.. నెలల వ్యవధిలోనే అధికారంలోకి తెచ్చారు.. వంటి ఊకదంపుడు ఉపన్యాశాల సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రస్తుతం ఎన్టీఆర్ కు టీడీపీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆయన జయంతులు, వర్ధంతులు… పార్టీ ఎందుకు చేయాలి? కుటుంబ సభ్యులు… కొడుకులు – కోడల్లు, కూతుర్లు – అల్లుళ్లు, మనవలూ – మనవరాళ్లూ చేసుకుంటే చేసుకున్నారు! పార్టీకి ఏమి సంబంధం?
ఎన్టీఆర్ మనోవేధనతో మరణించింది ఎవరి వల్ల అనే ప్రశ్న అడిగితే… ఆలో మోస్ట్ 90శాతానికిపైగా జనం, ఆయన అసలు సిసలు అభిమానులు… చంద్రబాబు వెన్నుపోటు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల అనే చెప్తారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘనంగా, అధికారంలో ఉనంప్పుడు సో సో గా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జరుపుతుంటారు. ఇది గతకొంతకాలంగా పరిపాటిగా మారింది. అయితే… ఎన్టీఆర్ కి ఎందుకు చేస్తున్నారు?
పోనీ టీడీపీ స్థాపకుడిగా ఆ పని చేస్తున్నారా అంటే… అసలా పార్టీ ఎన్టీఆర్ ది కానే కాదని… పార్టీని, సైకిల్ గుర్తుని, అకౌంటులో ఉన్న డబ్బుని కోర్టు ద్వారా తన పేరున రాయించుకున్నారు చంద్రబాబు. అలాంటప్పుడు పార్టీ ఈ వేడుకలు ఎందుకు చేయాలి? తెదేపా.. ఎన్టీఆర్ ది కానప్పుడు, ఆయనకు సంబంధం లేనప్పుడు… ఈ అనవసరపు దండగ ఖర్చు పార్టీ ఎందుకు భరించాలి. తెలుగుజాతిలో పుట్టిన గొప్ప వ్యక్తి అంటారా? పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన గొప్ప గొప్ప వారున్నారు కదా!
పోనీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాబుకి అంత ప్రేమ… అందుకే తనకు పిల్లనిచ్చిన మామకు సందర్భం వచ్చిన ప్రతీసారీ ఇలా దండలేస్తుంటారు అని అనుకుందామంటే… మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది! చంద్రబాబు తన సొంత తండ్రి ఫోటోకి ఏనాడు దండ వేయడం ఎవ్వరూ చూడలేదు. తన తల్లి ఫోటోకి దండం పెట్టడమూ ఎవ్వరూ చూసిందీ లేదు. కానీ ఏటేటా మామగారి ఫోటోకి దండేస్తాడు.. దండం పెడతాడు?… ఇది కరెక్ట్ కాదు బాబు గారు! మీ సొంత మామగారి కొసం పార్టీ ఫండ్స్ ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు! మీ ఫ్యామిలీ కార్యక్రమంలా చేసుకుంటే చేసుకోండి.. అంతే తప్ప… టీడీపీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి గురించి ఇంత సొమ్ము, మీ విలువైన సమయం వృథా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం!
ఇట్లు – సిసలైన టీడీపీ కార్యకర్త!