AP: ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం నేతలు కార్యకర్తలు మధ్య అక్కడక్కడ కొట్లాటలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకరంటే ఒకరికి పొంతన లేకుండా పోతుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. గతంలో జనసేన నాయకులు సైనికులు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మపై దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా మరోసారి జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా ఇక్కడ వివాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని కాస్త వంద పడకలుగా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం సభ అక్కడ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడంతో జనసైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టే వరకు జనసైనికులు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేశారు.
ఇక పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టిన అనంతరం టిడిపి ఇన్చార్జ్ వర్మ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అక్కడ చంద్రబాబునాయుడు ఫోటో పెట్టకపోవడమే కాకుండా అక్కడ ఉన్న ఫోటోను కూడా లాగి పడేయడం పై వర్మ మండిపడ్డారు. ఇదే కోపంలో వేదికపై నుండి దిగి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే వర్మ. హాస్పిటల్ మేనేజ్ మేంట్ ప్రోటోకాల్ ఉల్లంఘించి.. స్ధానిక ఎమ్మెల్యే హాస్పిటల్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయలేదని వర్మ ఆరోపించారు.
ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్ చివరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలను ఏర్పాటు చేయడంతో శాంతించిన వర్మ అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురంకు వంద పడకల ఆసుపత్రిని కేటాయించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
పిఠాపురం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం రసాభాస..
ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం వేదిక పై పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో లేదని సమావేశాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు.. @PawanKalyan… pic.twitter.com/J0MIXSJ8KP— RTV (@RTVnewsnetwork) December 19, 2024