ఓటిటి : వరసగా చిరు సినిమాలే కొనుకుంటున్న భారీ స్ట్రీమింగ్ సంస్థ.!

ప్రస్తుతం ఓ సినిమా థియేటర్స్ లో వస్తుంది అంటే ఆ సినిమా కంటే కూడా ఈ సినిమా ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో నెక్స్ట్ రాబోతుంది అనేది కూడా ఆడియెన్స్ లో ఆసక్తిగా మారిపోయింది. దీనితో నెక్స్ట్ అందులో వచ్చే ఆయా సినిమాల కోసం చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ ఓటిటి లో వరల్డ్ వైడ్ గా మంచి మోస్ట్ పాపులర్ అయ్యినటువంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి కాగా ఈ నెట్ ఫ్లిక్స్ వారు మన టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వరుస పెట్టి కొంటున్నారు. ఇది వరకే మెగాస్టార్ లాస్ట్ హిట్ చిత్రం “గాడ్ ఫాదర్” నెట్ ఫ్లిక్స్ లో హిందీ తెలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

కాగా ఇక ఇప్పుడు వచ్చిన మరి సూపర్ డూపర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” చిత్రం స్ట్రీమింగ్ హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వారే సొంతం చేసుకున్నారు. ఇక ఇది రెండో సినిమా కాగా నెక్స్ట్ అయితే మళ్ళీ ఏడాదిలోనే రిలీజ్ కి రాబోతున్న చిత్రం “భోళా శంకర్” చిత్రం హక్కులు కూడా వారే సొంతం చేసుకున్నట్టు వెల్లడి చేశారు.

అంతే కాకుండా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక నెట్ ఫిక్స్ లో భోళా శంకర్ తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ భాషలలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలిపారు. మరి ఎందుకో గాని వరుసగా హ్యాట్రిక్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ వారు చిరంజీవి వి దక్కించుకోవడం అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఈ ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ కాబోతుంది.