‘టిల్లు’గాన్కి హీరోయిన్ల ధమ్కీ.! కొత్త పిట్ట వేటలో.!

‘డిజె టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. సీక్వెల్ కోసం హీరోయిన్ల వేట కొనసాగుతూనే వుంది. హీరోయిన్ ఖరారవుతోంది, ఆ తర్వాత తప్పుకుంటోంది. ఇప్పటికే ముగ్గురు నలుగురు హీరోయిన్లు టిల్లుగాని లొల్లి పడలేక తప్పుకున్నారు.

ఆ లిస్టులో అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. ఆమె కాదనడంతో, మడోన్నా సెబాస్టియన్‌ని రంగంలోకి దించాలనుకున్నారు. అయితే, ఇప్పుడు ఆమె కూడా ధమ్కీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో కొత్త హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన టిల్లుగాన్కి, మీనాక్షి చౌదరి చిక్కిందని అంటున్నారు.

అయితే, ఆమె కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చివరికి ఓకే చెప్పిందట. ఓకే చెబితేనేం, ఆ ప్రాజెక్టులో కంటిన్యూ అవ్వాలి కదా.? అని టిల్లుగాని లొల్లి గురించి తెలిసినోళ్ళు అనుకుంటున్నారు. మామూలుగా అయితే పెద్ద హిట్టు కొట్టిన హీరోతో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా ఎందుకు వెనుకంజ వేస్తుంది.?

ఎక్కడో తేడా కొడుతోంది.. టిల్లుగాడు.. అదేనండీ సిద్దు జొన్నలగడ్డ పైత్యం వల్లనే ఇదంతా జరుగుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మీనాక్షి కాకపోతే, ఇంకో జలజాక్షి.. సినిమా తెరకెక్కుతుందో లేదోగానీ, హీరోయిన్ల వేట అయితే కొనసాగుతూనే వుంటుందేమో.!