ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లాలుగా చెప్పుకునే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు గురించే బలమైన చర్చ నడుస్తుంది. వైసీపీ టిక్కెట్ పై గెలిచి జగన్ పై అవాకులూ చేవాకులూ పేలి ఇప్పుదు ప్రతిఫలం అనుభవిస్తున్నారని ఒకరంటే… చంద్రబాబు రాజకీయానికి రాజు బలి అని మరొకరు అంటున్నారు. ఈ సమయంలో రఘురామ కృష్ణంరాజుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.
అవును… తనకు నరసాపురం టిక్కెట్ దక్కకపోవడంపై రఘురామ కృష్ణంరాజు… ఏపీ ముఖ్యమంత్రిని ఆడిపోసుకున్నారు! సోము వీర్రాజు తో కలిసి జగన్ సక్సెస్ అయ్యారని తనదైన ఆరోపణ చేశారు. కట్ చేస్తే… ఏపీలో ఇప్పుడు సోము వీర్రాజుకే టిక్కెట్ లేని పరిస్థితి. దీంతో… జగన్ పై రఘురామ కృష్ణంరాజు చేసే ఆరోపణలన్నీ ఆయన కడుపుమంటలో భాగాలే తప్ప.. వాస్తవ దూరాలనే మాటలు వినిపించాయి.
ఈ సమయంలో… తనకు టిక్కెట్ ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఉందని నొక్కి చెప్పారు రఘురామ కృష్ణంరాజు. నిప్పు ఎక్కడున్న కాలుస్తాదనీ అన్నారు. అయినా కూడా రఘురామ కృష్ణంరాజుకి టిక్కెట్ ఇప్పించే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. శతకోటి లింగాల్లో బోడి లింగం అని భావిస్తున్నట్లున్నారని అంటున్నారు. దీంతో… ట్రిపుల్ ఆర్ కీలక నిర్ణయం దిశగా అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా… తనకు గనుక టిక్కెట్ ఇప్పించకపొతే గతంలో జగన్ పై ఎలా విరుచుకుపడ్డారో, అదే తరహాలో చంద్రబాబు – పవన్ లపైనా విరుచుకుపడే అవకాశాలున్నాయని అంటున్నారు! పైగా.. పలువురు అనుచరులు ఆ మేరకు సూచనలు చేస్తున్నారని.. తమకు వెన్ను పోటు పొడిచినవారిని వదిలిపెట్టొద్దని కోరుతున్నారని సమాచారం. ఇక పోటీ చేసే విషయంలో కూడా రఘు కీలక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఈ క్రమంలో… రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా.. పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిస్తే… 2019 గెలుపులో కూడా తాను చెబుతున్నట్లు తన షేర్ కూడా ఎక్కువే అని చెప్పినట్లవుతుందని అనుచరులతో కూర్చిని ఆలోచిస్తున్నారని సమాచారం! అయితే… పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంత విషయం రఘురామకు లేదని.. టీవీల్లో మాటలకు, ఎన్నికల బరిలో దిగడానికీ చాలా వ్యత్యాసం ఉందని.. అది ఆయనవల్ల కాదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారని సమాచారం!