బిగ్ బ్రేకింగ్: పీకే సర్వేలో కోనసీమ ఎమ్మెల్యేల పేర్లు?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఐప్యాక్ టీం సర్వే రిపోర్ట్స్ లీకయ్యాయనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కవన్న ప్రచారం ఊపందుకుంది! ఫలితంగా పలువురు ఎమ్మెల్యేలు భుజాలు తడుముకుంటున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా… డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు భూజాలు తడుముకోవడమే కాకుండా… ఆల్ మొస్ట్ కన్ ఫాం అయిపోయినట్లేననే బెంగతో కూర్చున్నారని తెలుస్తుంది!

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో ఒకరి అధికారిక, మరొకరు అనధికారిక ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు నేతలపై ఐప్యాక్ టీం నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం! వీరిరువురూ ఇరుగుపొరుగు నియోజకవర్గాలే నేతలే కావడం గమనార్హం. అయితే కేడర్ ను కలుపుకుపోయే లక్షణాలు లేకపోవడంతోపాటు… కలిసున్న కేడర్ నే “విభజించు – పాలించు” ఫార్ములాతో నడిపిస్తున్నారని సమాచారం తేలిందంట.

రాబోయే ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వని పక్షంలో తనవైపు కొంత వైసీపీ క్యాడర్ ను వెంటపెట్టుకునిపోయే ఆలోచనలో భాగంగా… పార్టీ కంటే వారి వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఐప్యాక్ టీం నిర్ధారించిందంట! పైగా భజనలో వీరిద్దరూ నిష్ణాతులే అయినప్పటికీ… ఆ విషయంలో మాత్రం జగన్ ని కరగొద్దని పీకే టీం సూచిస్తుందని తెలిసింది. కారణం… ఈ ఇద్దరు నేతలే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీచేస్తే… ఓడిపోయే సీట్లలో ఇవి ఫస్ట్ స్థానం కోసం పోటీపడతానే స్థాయిలో జగన్ కి సమాచారం అందిందని తెలుస్తుంది!

అయితే వీరిలో ఒకరు వైవీ సుబ్బారెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరవేరుస్తున్నప్పటికీ… ఆయన సైతం పునరాలోచనలోపడిన పరిస్థితి అని సమాచారం! ఈ లెక్కన చూసుకుంటే… “తెలుగురాజ్యం.కాం” ఎప్పటినుంచో చెబుతున్నట్లుగానే… రాబోయే ఎన్నికల్లో పక్కపక్కనే ఉన్న రెండు నియోజకవర్గాల్లోని ఈ ఇద్దరు నేతలకూ టిక్కెట్లు డౌట్ అనే టాక్ కోనసీమ జిల్లాలో మొదలైపోయింది!! మరి ఈ విషయం సదరు ఇద్దరు నేతల వరకూ పూర్తిగా వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది!