తెలిసి చేస్తున్నాడో.. లేక, డూ ఆర్ డై పరిస్థితుల్లో తనకు ఇంతకు మించిన ఆప్షన్ లేదని చేస్తున్నాడో తెలియదు కానీ… పవన్ కళ్యాణ్ ఒక కొత్త రకం పనిచేస్తున్నారు. బహిరంగంగా టచ్ చేయకూడని విషయాలను సభా వేదికలపై మైకులందుకుని మాట్లాడేస్తున్నారు. అధికారపక్షాన్ని ఇరుకునపెడుతున్నామనే మైకంలో సున్నితమైన విషయాలను టచ్ చేస్తున్నారు.
అవును… కాకినాడలో నిర్వహించిన వారాహి విజయాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. జనసైనికుల్లో పూనకాలు లోడ్ చేశారు. సరే ఈ క్రమంలో అధికారపక్షం నేతలపై కామెంట్లు చేసిన సంగతి కాసేపు పక్కనపెడితే… సున్నితమైన కులాల మధ్య గోడలు కట్టేసే పనికి పూనుకున్నారు జనసేనాని. దీంతో.. కులాల మధ్య ఉండే సున్నితమైన సరళరేఖను పవన్ తన మాటలతో డిస్ట్రబ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కారణం… సమాజంలో అన్ని కుల్లాల్లోనూ మంచి వారుంటారు.. చెడ్డవారుంటారు. అన్ని కులాల్లోనూ డబ్బున్న వాళ్లూ ఉంటారు.. కటిక దరిద్రులూ ఉంటారు. అన్ని కులాల్లోనూ నేరస్తులు ఉంటారు.. ఉత్తములూ ఉంటారు. అయితే… ఇక్కడ ఆ నేరస్తుడిని, ఆ చెడవ్యక్తి చేసిన పనిని మాత్రమే ప్రస్థావించాల్సిన చోట… పవన్ నేరుగా కులాన్ని తెరపైకి తెచ్చేస్తున్నారు. ఇది బ్రిటీష్ వారు ఉపయోగించిన “డివైడ్ అండ్ రూల్” పాలసీకి దగ్గర ఉందనే మాటలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
ఎవరికి ఎవరు మిత్రుడు… ఏ కులానికి ఏ కులం శత్రువు! కులాంతర వివాహాలు విపరీతంగా జరుగుతున్న ఈ రోజుల్లో… ఒక సామాజిక వర్గం వ్యక్తి తప్పు చేస్తే ఇక పూర్తిగా ఆ సామాజికవర్గంలోని వారంతా అదే బాపతు అనడం అజ్ఞానానికి పారాకాష్ట అవుతుంది. ఇదే సమయంలో ఒక కులంలో వ్యక్తికి అన్యాయం జరిగితే… ఈ ప్రభుత్వ పాలనలో ఆ కులం మొత్తం అణిచివేయబడుతుందనే వ్యాఖ్యలు కూడా అర్థజ్ఞానానికి మచ్చుతునక!
అయితే ఇవి రాజకీయాలకు వాడుకోవాలని భావిస్తే.. కేవలం కులాల మధ్య గోడలు కట్టి మనుగడ కాపాడుకోవాలనుకుంటే… ఇది ఈరోజుల్లో చాలా ప్రమాధం అనే విషయం పవన్ గ్రహించాలనేది పలువురి సూచనగా ఉంది. మరి పవన్ ఈ సూచనలు పరిగణలోకి తీసుకుంటారా.. లేక, తాను రాజకీయంగా బ్రతకడం కోసం ఎంతకైనా తెగించేస్తారా అన్నది వేచి చూడాలి!
కాగా… తాజాగా కాకినాడలో మాట్లాడిన పవన్… “ఏపీలో కులాలను అడ్డం పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. ప్రజలు ఎదగడం లేదు. జనసేన కులమతాలకు అతీతంగా అన్నివర్గా ల వారికి సమన్యాయం అందిస్తుంది.” అనిమొదలుపెట్టి… “అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన తన కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అప్పుడు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేశారు? బాపట్లలో అక్కను ఏడిపిస్తున్నాడని ప్రశ్నించినందుకు గౌడ సామాజికవర్గానికి చెందిన ఆ యువతి సోదరుడిని చెరువుతోటలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి హత్య చేశారు. ఇప్పుడెందుకు బీసీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడడం లేదు. అన్నివర్గాల ప్రజలు ఆలోచించి జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తే సామాజిక న్యాయం చేస్తాం” అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ మాటల్లో అభ్యంతరమంతా నేరాలు చేసే నేరస్తుల గురించి మాట్లాడాలే తప్పించి.. వారి సామాజిక వర్గాల గురించి మాట్లాడటమే. దీంతో… పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇదే క్రమంలో… కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంపై దాడి చేసి, తన ఇంట్లోని మహిళలపై దుర్భాషలాడినప్పుడు.. ఇదంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని విమర్శలు వచ్చినప్పుడు.. పవన్ కల్యాణ్ ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? అనే ప్రశ్నలు కూడా వస్తుంటాయన్న విషయం పవన్ మరిచిపోకూడదు!!
ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ కుల రాజకీయాల విషయాలను ప్రజలు పూర్తిగా గ్రహిస్తే… అన్నదమ్ముళ్లా ఉన్న అన్ని కులాల మధ్య పవన్ గోడకడుతున్నాడనే విషయం ప్రజలు గ్రహిస్తే… విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పవన్ అవలంభిస్తున్నాడన్న విషయం జనాల్లోకి వెళ్లిపోతే… పవన్ పొలిటికల్ ఫ్యూచర్ అత్యంత దయణీయంగా మారిపోయే ప్రమాధం ఉందని అంటున్నారు పరిశీలకులు.