రామ్ చరణ్, ఎన్టీయార్ స్నేహాన్ని ‘ఆస్కార్’ చెడగొట్టిందా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం కలిశారు. ఈ ఇద్దర్నీ రాజమౌళి కలిపాడు. కాదు కాదు, చాలాకాలంగా ఇద్దరూ మంచి స్నేహితులట. అలాగని, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో చరణ్, ఎన్టీయార్ తరచూ చెప్పేవారు.

మరి, ‘ఆస్కార్’ హంగామా మొదలయ్యాక, రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్ ఎందుకు.. దూరంగా వుంటున్నారు.? ఆస్కార్ వచ్చాక సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరుని ఎన్టీయార్ మర్చిపోయాడు. రామ్ చరణ్ మాత్రం మర్చిపోలేదు.

‘ఎన్టీయార్30’ సినిమా ప్రారంభోత్సవానికి స్నేహితుడు రామ్ చరణ్‌ని ఎన్టీయార్ ఎందుకు పిలవలేదో ఏమో.! ఒకవేళ ఇద్దరూ ఆ వేదికపై కలిసి వుంటే, అభిమానులకి ఓ మంచి సంకేతాన్ని పంపినట్లయ్యేది. ఎక్కడో తేడా కొట్టింది. ఇద్దరూ ఒకరికొకరు దూరంగా వుంటున్నారు.

ఇంతకీ, ఏం జరిగిందబ్బా.? ఆస్కార్ గానీ ఈ ఇద్దరి స్నేహాన్నీ చెడగొట్టిందా.? ఏంటీ.!