‘యన్‌.టి.ఆర్‌’ ట్రైలర్‌ జెన్యూన్ రివ్యూ

తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బాలకృష్ణ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ రోజు ఈ సినిమా ఆడియో విడుదల వేడుక సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి నుంచి చివరి వరకూ చాలా ఇంట్రస్టింగ్ గా ఈ ట్రైలర్ ని రూపొందించారు.

ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అవతాయనటంలో సందేహం లేదు. అలాగే… క్రిష్ మేకింగ్ టాలెంట్ కూడా మరో సారి అద్బుతమని ప్రూవ్ అయ్యింది. సినిమా కూడా ఇదే స్దాయిలో ఉంటే పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఏదైమైనా ఇంతకు మించి బెస్ట్ ప్రొడక్ట్ అయితే వేరే డైరక్టర్ తేలేరనిపించింది.

#NTR Official Trailer | #NTRKathanayakudu #NTRMahanayakudu | Nandamuri Balakrishna | Krish

అయితే కొందరు మాత్రం…మహానటి స్దాయిలో లేదని, బాలయ్యే కనపడుతున్నారని, ఎన్టీఆర్ కనపడటం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాారు. తన తండ్రి ఆహార్యమే బాలయ్య అనుకరిస్తున్నారని, ఆయన మేనరిజమ్స్ వంటివి యాజటీజ్ దించలేకపోయారని చెప్తున్నారు. కేవలం కాస్టూమ్స్ తో , మేకప్ తో ఎన్టీఆర్ లుక్ తెస్తున్నారు కానీ బాలయ్య నటనతో కూడా దాన్ని చూపగలగితే  అద్బుతంగా ఉండేదని ఫిల్మ్ నగర్ వర్గాలు  అంటున్నాయి. 

‘ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని చెప్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. అలాగే… ‘60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం… ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అని బాలయ్య అనటం బాగుంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన మరణించే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో పిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.