అవును వాళ్లిద్దరూ జాగ్రత్త పడ్డారు.!

సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య మరో అమ్మాయితో చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నాడంటూ గాసిప్స్ వచ్చాయ్. ఆమె మరెవరో కాదు, తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాళ్ల అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇంకేముంది వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరిగింది. రీసెంట్‌గా రిలీజైన ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్లలో నాగ చైతన్య ముందు దీనికి సంబంధించిన పలు ప్రశ్నలు తలెత్తాయ్. వాటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డాడు కూడా చైతూ. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. వీరి కలయికకు సంబంధించి ఎలాంటి క్లిప్పింగ్స్ రాకుండా చూసుకున్నారు.

కాదు, కాదు, ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందట అనే ప్రచారం కూడా వినిపించింది. కానీ, ఈ ఇద్దరూ కలిసే వున్నారట. సీక్రెట్‌గా యవ్వారం నడిపించేస్తున్నారట.. అంటూ మరో గాసిప్ వినిపిస్తోంది తాజాగా. ప్రచారం జరుగుతున్నట్లుగానే నిజంగా చైతూ, శోభిత విడిపోయారా.? లేక కెమెరాకి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారా.? క్లారిటీ రావల్సి వుంది.