నారా లోకేష్ కష్టపడుతున్నారు.! డౌటేం లేదు. పాదయాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఓ ఐదొందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యేసరికి కాళ్ళు పైకెత్తేస్తారని అంతా అనుకున్నారు. కానీ, లోకేష్ పాదయాత్ర కొనసాగుతూనే వుంది.
రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పైన పాదయాత్ర జరిగింది ఇప్పటిదాకా.! అద్సరేగానీ, ఈ పాదయాత్ర వల్ల టీడీపీకి ఒరిగిందేంటి.? మొన్నామధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కింది. ఆ ఉత్సాహంతోనే వున్నారు కొందరు టీడీపీ నేతలు ఇప్పటిదాకా.!
ఖర్చు గట్టిగానే జరుగుతోంది లోకేష్ పాదయాత్రకి. బాగానే ఏంటి.? చాలా చాలా ఎక్కువ ఖర్చవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన ఓ కీలక టీడీపీ నేత, కొంత భూమిని అమ్మేసి, లోకేష్ పాదయాత్ర కోసం ఖర్చు చేశారన్న ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.
ఇంతకు ముందు కూడా పలు జిల్లాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇలాంటి ప్రచారాలు జరిగినా, ఈసారి అవి ఇంకాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. తప్పదు.. రాజకీయాలన్నాక ఖర్చు చేయాల్సిందే. కానీ, మరీ ఇంతలాగానా.?
ఇప్పుడే ఖర్చు చేసుకుంటూ పోతే, ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఏం మిగులుతుందట.? కానీ, తప్పదు.. ఖర్చు చేయాల్సిందే.! నారా లోకేష్ పాదయాత్ర ఎలాంటి రికార్డుల్ని ముందు ముందు క్రియేట్ చేస్తుందోగానీ, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఖరీదైన పాదయాత్రగా ఇప్పటికే ఈ యాత్ర సరికొత్త రికార్డుల్ని సృష్టించిందని అంటున్నారు.
ఇంతకీ, కృష్ణా జిల్లాలో ఆస్తులు అమ్మకుని, పాదయాత్ర కోసం వెచ్చించిన ఆ టీడీపీ ప్రముఖ నేత ఎవరబ్బా.?