మార్గదర్శి స్కామ్.! తప్పులు ఒప్పేసుకున్న రామోజీ, శైలజ.?

మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో తప్పులు జరిగినట్లు రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్ ఒప్పేసుకున్నారట. అలాగని వైసీపీ చెబుతోంది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలకీ, వాస్తవాలకీ చాలా తేడాలుంటాయ్. ఈ విషయమై జనానికీ ఓ అవగాహన వుంది.

వైసీపీనే అధికారంలో వుంది. అలాంటప్పుడు, రామోజీ అలాగే శైలజా కిరణ్ తప్పు చేశారని తేలితే, అరెస్టు చేసేసి.. లోపలేసెయ్యొచ్చు కదా.? ఇంతవరకు రామోజీ, శైలజా కిరణ్ అరెస్టు దిశగా ఏపీ సీఐడీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దానర్థమేంటి.?

మార్గదర్శి స్కామ్‌కి సంబంధించి నిందితుల విచారణ మాత్రమే జరుగుతోంది. కొన్ని అరెస్టులు జరిగినా, పెద్ద తలకాయల జోలికి ఇంకా ‘అరెస్టు’ విషయమై వెళ్ళలేదు. రామోజీ జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని వైసీపీ చెబుతోంది. అయితే, ఈ విమర్శలన్నీ రాజకీయ కోణంలో జరుగుతున్నవే.

నిజానికి, ఇదంతా ఓ ప్రసహనం. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, ఇదే రామోజీరావు తన మీడియా సంస్థల ద్వారా ‘దొంగ’ అనే ముద్ర వేశారు. దానికి ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్న కౌంటర్ ఎటాక్ ఇదంతా.. అనుకోవాలేమో.!

మార్గదర్శిలో అక్రమాలు జరగలేదా.? అంటే, జరిగాయి గనుకనే.. రామోజీ, అనారోగ్య సమస్యలంటూ సీఐడీ విచారణ సందర్భంగా మంచమ్మీద పడుకోవాల్సి వచ్చింది. అయితే, పక్కా ఆధారాలు దొరకాలి ఏపీ సీఐడీకి.. ఆయన్ని అరెస్టు చేయాలంటే.