‘పుష్ప’ కోసం మహేష్‌బాబుని తీసుకొస్తారా.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ అయిపోయాడు. ‘పుష్ప ది రైజ్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ‘పుష్ప ది రూల్’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవ్. నిజానికి, సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. త్వరలో సెట్స్ మీదకు సినిమాని తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా ఖబర్ ఏంటంటే, ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ సాయం తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ అనుకుంటున్నాడట. ప్రస్తుతానికైతే ఓ చిన్న వాయిస్ ఓవర్ లాంటిది.. అని సమాచారమ్.

అయితే, సినిమాలో మహేష్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే ఎలా వుంటుంది.? అన్న ఆలోచన సుకుమార్‌తోపాటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి కూడా వచ్చిందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా’కి మహేష్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అలాంటి సాయం మహేష్ మరికొన్ని సినిమాలకీ చేశాడు. సో, ‘పుష్ప’ విషయంలోనూ సుకుమార్ అడిగితే, మహేష్ ముందుకు రాకుండా వుంటాడా.?