కృతి శెట్టి ఆగ్రహం నాగచైతన్య మీదేనా.?

సినిమా ఫెయిలైతే చాలు, ఆ హీరోయిన్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా. నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మొన్న పూజా హెగ్దే, నిన్న సమంత, ఇప్పుడు కృతి శెట్టి. ఈ ట్రోల్స్ చాలా బాధాకరంగా వున్నాయంటూ తాజాగా కృతి శెట్టి వాపోయింది.

లేటెస్ట్‌గా ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే కృతి శెట్టి. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం అందుకోలేదు. అక్కడికేదో తప్పంతా తనదే అన్నట్లు ఆన్ లైన్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు కృతి శెట్టి మీద.

ఈ ట్రోల్ చేసింది నాగచైతన్య అభిమానులే అని కొందరు, కాదు కాదు, అక్కినేని అభిమానులు.. అంటూ ఇంకొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. సినిమా ఫెయిల్యూర్స్ విషయంలో ఇలా హీరోయిన్లను ట్రోల్ చేయడం చాలా దారుణమైన పరిస్థితే. దీనికి పాడాలి చరమ గీతం.

ఎంత హర్టయితే కృతి శెట్టి ఇంతలా రెస్పాండ్ అవుతుంది. తాను చేసిన తప్పేంటీ.? అని పరితపించిపోతుంది.? ఈ విషయంలో ‘ఏజెంట్’ భామ కాస్త లక్కీనే. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ సాక్షి వైద్య నెత్తిన రుద్దలేదు. అక్కడికి ఆమె సేఫ్ అయినట్లే.!