ప్రేమ గుడ్డిది అని వింటూనే ఉంటాం. ఒకోసారి కొందరు ప్రేమ జంటల్ని చూసినప్పుడు అలాంటి భావన కలుగుతూ ఉంటుంది. ప్రేమికులు మాత్రం మాకు ప్రపంచంతో పని లేదు. ప్రేమకి వయసు, కులం, మతం అనే తార తమ్యాలు లేవంటారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా తమకంటే పెద్దవారైన ఆడవారిని పెళ్లి చేసుకున్న ఇండియన్ సెలెబ్రిటీల గురించి తెలుసుకుందాం.
ఆదిత్య పంచోలి-జరీనా వహాబ్
జరీనా కంటే ఆదిత్య ఆరు సంవత్సరాలు చిన్నవాడు. ‘కలంక్ కా టీకా’ మూవీ సెట్స్ లో కలిసిన ఈ జంట 1986 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు సనా, కొడుకు సూరజ్.
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్
వయసులో అభిషేక్ కంటే ఐశ్వర్యారాయ్ రెండేళ్లు పెద్దది. 2007 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.
శిరీష్ కుందర్-ఫరా ఖాన్
ప్రముఖ కొరియోగ్రాఫర్, ఫిలిం మేకర్ అయిన ఫరా ఖాన్ తన భర్త శిరీష్ కుందర్ కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది. ‘మై హూ నా’ సెట్స్ లో కలిసిన వీరిద్దరూ 2004 లో వివాహం చేసుకున్నారు. ఫరా ఒకే కాన్పులో ఒక మగ, ఇద్దరు ఆడ సంతానానికి జన్మనిచ్చింది.
సునీల్ దత్-నర్గీస్
సునీల్ దత్ తనకంటే ఒక ఏడాది పెద్దది అయిన కో స్టార్ నర్గీస్ ను వివాహమాడాడు. వీరు ‘మదర్ ఇండియా’ సెట్స్ లో కలుసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న నర్గీస్ ను కాపాడాడు. ఆ తర్వాత సంవత్సరానికే వీరి వివాహం అయ్యింది. వీరికి సంజయ, ప్రియా, నమ్రత అనే ముగ్గురు సంతానం కలరు.
అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా
అర్జున్ తన మాజీ భార్య మోడల్ మెహర్ కంటే రెండేళ్లు చిన్నవాడు.1998 లో వివాహం చేసుకున్న వీరికి మహిక, మైరా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రీసెంట్ గా ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ధనుష్-ఐశ్వర్య
ధనుష్ రజినీకాంత్ పెద్ద కూతురిని 2012 లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ధనుష్ కంటే ఒక ఏడాది పెద్దది.
ఫరాన్ అక్తర్-అధునా భబాని
ఫరాన్ అధునా కంటే ఆరు సంవత్సరాలు చిన్నవాడు. ‘దిల్ చాహతా హై’ మూవీ కోసం ఫరాన్ స్క్రిప్టింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. 2000 సంవత్సరంలో వీరి వివాహమయ్యింది. షక్యా, అకిరా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తతం ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్-అమ్రితా సింగ్
సైఫ్ తన మాజీ భార్య అమ్రితా కంటే పన్నెండేళ్ళు చిన్నవాడు. 1991 లో వివాహమాడిన వీరు, పెళ్ళైన పదమూడేళ్లకు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు సారా అలీ ఖాన్, కొడుకు ఇబ్రహీం.
పర్మీత్ సేఠీ-అర్చనా పురాన్ సింగ్
వీరి వివాహం 1992 లో జరిగింది. పర్మీత్ అర్చనా కంటే ఏడేళ్లు చిన్నవాడు. వీరికి అర్యమాన్, ఆయుష్మాన్ అనే ఇద్దరు కుమారులున్నారు.