ఆ హీరోయిన్ వద్దు మహాప్రభో.!

ఆమె మంచి నటి.! పైగా, యువ నటి. గ్లామరస్‌గానూ కనిపించగలదు. లిప్ లాక్స్‌కి సైతం అభ్యంతరాలు వ్యక్తం చేయదు. సీన్స్ ఇంప్రవైజేషన్‌లోనూ దిట్ట.! సినిమా పట్ల పూర్తి అవగాహన కూడా వుంది.

ఇన్ని మంచి లక్షణాలుంటే, అవన్నీ అవలక్షణాలుగానే పరిగణిస్తారేమో సినీ పరిశ్రమలో. ఫ్లాపులొస్తున్నా ఆమెకు అవకాశాలైతే వస్తున్నాయ్. ఇదో వింత. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ ఇంకో ఫ్లాప్ చవిచూసింది.

ఇక చాలు.. అంటూ ఆమె గురించి సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ‘ఆమెతో సినిమా చేస్తే అంతే సంగతులు..’ అని ఆమెతో ఆల్రెడీ పని చేసిన కొందరు హీరోలు కూడా అనుకుంటున్నారట.

చిత్రంగా, ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గడంలేదు. చేతిలో నాలుగైదు సినిమాలున్నాయ్. ఎందుకట.? నిర్మాతల ఫ్రెండ్లీ అని టాకు.!