సినిమా పరిశ్రమ తరపున క్షమాపణ చెప్తూ.. తన ఆవేదన వ్యక్తం చేసిన అనంత్ శ్రీరామ్!

విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద జరిగిన విశ్వ హిందూపరిషత్‌ హైందవ శంఖారావం సభనిర్వహించారు. ఈ సభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వీహెచ్‌పీ, హిందూ ధర్మాక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకి రామాయణం, వ్యాసుని మహా భారతం.. భారత సాహిత్యానికి రెండు కళ్లులాంటివని.. కానీ అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా, అవహేళన చేసేలా, కించపరిచేలా తెలుగు సినిమాలను తీస్తోన్నారని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అత్యధిక మంది నటులు, దర్శకులను అందించిన ఉమ్మడి కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడే తాను ఈ మాటలు అంటున్నానని అన్నారు.

అలాంటి సినిమాలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఘనకీర్తి కలిగిన మన పురాణాలు, ఇతిహాసాలను సైతం తెలుగు సినిమాలు కించపరుస్తోన్నాయని అనంత శ్రీరామ్ అన్నారు. అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును అందుకున్న అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సును చేతబట్టిన కర్ణుడు వీరుడంటూ ఇటీవలే వచ్చిన కల్కి సినిమాలో చెప్పారని, యుద్ధంలో నెగ్గేది ధనస్సా, ధర్మమా అని మనం ప్రశ్నించుకుండా మనం ఊరుకుంటామా? అని ప్రశ్నించారు అనంత్ శ్రీరామ్.

బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు. తాను లక్ష్యం సినిమాకు 12 నిమిషాల హిందూ పాట రాశాను.. లక్ష్యం కథ లాంటి కథ వస్తే మరల అలా పాటలు రాస్తానని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు.

హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు.. అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. సినిమాలో ఇలా హిందూ వక్రీకరణకు పాల్పడుతున్నందుకు సినిమా వ్యక్తిగా బాధపడుతున్నానని, సినీ పరిశ్రమ తరపునుంచి తాను క్షమాపణ చెప్తున్నాను అని తన ఆవేదన వ్యక్తం చేశారు అనంత్ శ్రీరామ్.