Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా రాణిస్తున్న చాలామంది మొదట మోడల్ గా కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈమె కూడా మొదట మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా నిలిచింది. ఆ తర్వాత సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నందిని రాయ్. సినిమాలలో ఎక్కువ శాతం గ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నందిని రాయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ వారసుడు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ సర్ వారసుడు సినిమాలో నాది చిన్న రోల్ కాదు. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాష్ రాజు కూతురు పాత్ర, శ్రీకాంత్ ని రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ షూటింగ్ కూడా చేసారు. అది ఒక మంచి క్యామియో పాత్ర. కానీ ఎడిటింగ్ లో చాలా సీన్స్ తీసేసారు. సినిమాలో 2 నిముషాలు కూడా లేదు నా పాత్ర. సినిమా రిలీజ్ అయ్యాక ఎందుకు ఆ సినిమా చేసావు అని ప్రశ్నలు వచ్చాయి. నేను ఏం చేయలేను.
ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్ గా రిలిజ్ చేసారు. దాంతో పెద్ద పాత్ర అనుకున్నాను. కానీ నేను ఊహించలేదు. ఆ సినిమా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు లాంటి పాత్రలు మళ్ళీ చేయను అని చెప్పుకొచ్చింది నందిని రాయ్. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కువసేపు నటించిన కూడా తన సన్నివేశాలు కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉండడం పట్ల బాధను వ్యక్తం చేసింది నందిని రాయ్. అనంతరం గ్లామర్ రోల్స్ గురించి మాట్లాడుతూ.. ఇంకా నేను స్కిన్ షోలు ఇంక చేయను. అనకాపల్లి అనే మూవీలో బాగా బోల్డ్ చేశాను. అది చూసి మా అమ్మ, నాన్న తిడతారేమో. అదే లాస్ట్ నేను స్కిన్ షో చేయడం. అందరూ నన్ను ఐటెం సాంగ్స్, లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉన్న సినిమాలు అడుగుతున్నారు. నేను డీ గ్లామర్ రోల్స్ చేయాలి. నాకు కథలు వస్తున్నాయి కానీ నచ్చట్లేదు అని చెప్పుకొచ్చింది నందిని రాయ్.