ప్రస్తుతం బీజేపీలో పురందేశ్వరి పరిస్థితి ఆటలో అరటిపండేనా.. జగన్ పట్ల ఆమె చేసిన విమర్శలకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి మద్దతు శూన్యమేనా.. అసలు ఆమెకు బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి.. ఆమెకు హస్తినలో ఒకటి చెబితే ఏపీలో మరొకటి చేస్తున్నారా.. అనే ప్రశ్నలు వైరల్ గా మారుతున్నాయి.
అవును… ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం టార్గెట్ జగన్ అనే డ్యూటీలో ఉన్నారు పురందేశ్వరి. ఒక్క విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా కానీ లేదా టీడీపీని తప్పుపడుతూ కానీ మాట్లాడింది లేదు. దీంతోనే ఆమె టార్గెట్ అంతా కేవలం జగన్ మాత్రమే అని అర్థమైపోతోంది. అయితే ఈ అక్కసుకు కారణం ఇదే అంటూ ఒక అంశం తెరపైకి వచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన పురందేశ్వరి… కేంద్రానికి ఎందుకు మద్దతిస్తోందో వైసీపీనే అడగాలని చెప్పారు. సభా నిర్వహణకు, ఫ్లోర్ మేనేజ్మెంట్ కు అసలు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలుంటే రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలమా? అని ఎదురు ప్రశ్నించారు.
అయితే ఇందులో ఆమె చెప్పిన ప్రతీ మాటా… జగన్ పై తనకున్న అక్కసును వెల్లడిపరుస్తుందని అంటున్నారు. పైగా బీజేపీ అగ్రనాయకత్వంతో జగన్ కు ఉన్న సాన్నిహిత్యం ఈమెకు ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో… చంద్రబాబును బీజేపీని కలపాలని ఈమె తాపత్రయపడుతున్నారని చెబుతున్నారు.
దీంతో… ఆమె అవగాహనారాహిత్యమో.. లేక, ఆమె వ్యక్తిగత అభిప్రాయ కారణమో తెలియదు కానీ… అవసరమొచ్చినప్పుడల్లా కేంద్రానికి జగన్ ఎందుకు మద్దతిస్తున్నారో పురందేశ్వరికి తెలీదా? బలం లేకపోయినా రాజ్యసభలో బిల్లులు ఎలా గట్టెక్కుతున్నాయి? మోడీ లేదా అమిత్ షా అడక్కుండానే జగన్ మద్దతిస్తున్నారా? రాజకీయంగా కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమైపోద్ది.
కేంద్రానికి మద్దతు ఇవ్వమని అడిగుంటారు కాబట్టే జగన్ మద్దతిస్తున్నారనేది స్పష్టం! ఇదే సమయంలో నరేంద్రమోడీ, జగన్ మధ్య మంచి సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఫలితంగా… రాష్ట్రానికి పోలవరం నిధులు, రెవెన్యూ లోటు తదితరాలు రావటం తెలిసిందే. అయితే ఇవేవీ కూడా పురందేశ్వరి తట్టుకోలేకపోతున్నట్లున్నారు.
ఆ అక్కసును జగన్ పై విమర్శలు చేయడం ద్వారా బయటపెడుతున్నారు అని అంటున్నారు పరిశీలకులు. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… కేంద్రంలో బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతిస్తుందో జగన్ ని అడగండి అని అంటున్న పురందేశ్వరి… మరి టీడీపీ ఎందుకు మద్దతిస్తుందో చంద్రబాబుని అడగగలారా? అని అడుగుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… పోలవరం నిర్మాణంలో జగన్ ఫెయిలయ్యారు కాబట్టి వెంటనే ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు పురందేశ్వరి. అసలు అది కేంద్రం పూర్తిచేయాల్సిన జాతీయ ప్రాజెక్టే. అది చంద్రబాబే రాష్ట్ర బాధ్యతగా పనికిమాలిన ఆలోచన చేశారని విమర్శలు వచ్చాయి! అవేమీ స్పందించకుండా.. కేవలం జగన్ పైనే అక్కసు వెల్లబుచ్చుతున్నారు. ఫలితంగా ఉన్న గౌరవం పాడు చేసుకుంటున్నారు!