ఓ వైపు జనసేన పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీతో అంట కాగుతోంది. మరో వైపు, భారతీయ జనతా పార్టీతో సఖ్యత కోసం ప్రయత్నిస్తోంది.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయమేంటో టీడీపీ శ్రేణులకీ అర్థం కావడంలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సంపూర్ణ మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నాటక సీనియర్ నేత డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా మాట్లాడారట చంద్రబాబు బెంగళూరు వెళ్ళినప్పుడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై చంద్రబాబుకంటూ కొన్ని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒకింత ముందు జాగ్రతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అస్సలు గిట్టదు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం అవసరమైతే జనసేన పార్టీని డంప్ చేయడానికి వెనుకాడరు చంద్రబాబు. మరి, బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకు తహతహలాడుతున్నట్టు.? ఇదో మిస్టరీ మళ్ళీ.!
బీజేపీకి మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు కేటాయించడానికి చంద్రబాబు సుముఖంగానే వున్నారు. అసెంబ్లీ సీట్లు కూడా అంతే స్థాయిలో ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన అట. కానీ, బీజేపీ మాత్రం 8 వరకు లోక్ సభ సీట్లను అడుగుతోందిట. పన్నెండు వరకు అసెంబ్లీ సీట్లను కోరుకుంటోంది బీజేపీ.
ఈ ఈక్వేషన్ వర్కవుట్ అయితే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. ఈక్వేషన్ ఇంత క్లియర్‌గా వుండి కూడా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు దువ్వుతుండడమే ఆసక్తికర అంశం. దటీజ్ చంద్రబాబు.!