‘ఖుషి’కి ఆ దెబ్బ.! కథ అడ్డం తిరిగిందిలా.!

‘ఖుషి’ సినిమాని ఫస్ట్ డేనే బాబోయ్ అన్నారు.. కానీ ఏదో ఫ్యాక్టర్ కలిసొచ్చింది. హిట్టు బొమ్మ అని టాక్ బయటికొచ్చింది.

అయితే ఆ తర్వాత ఓకే ఫర్లేదంతే.. అన్నంత వరకూ వెళ్లింది. శని ఆది వారాలకొచ్చేసరికి టాక్ మారింది. కానీ, సోమవారం దారుణంగా పడిపోయింది.

శుక్రవారం డిజాస్టర్ అన్నోళ్లు ఆదివారం బాగుంది అన్నారు. మళ్లీ సోమవారానికి బాలేదన్నారు. ఆ తర్వాత మళ్లీ డిజాస్టర్ అని తేలింది.

సాధారణంగా ఏ సినిమాకీ ఇలా జరగదు. తొలి రోజు టాక్ బాగుంటే బాగున్నట్లు.. లేదంటే రెండో రోజుకు లేదా.. వీకెండ్‌కి పుంజుకుంటే పుంజుకున్నట్లు.. కానీ, ‘ఖుషి’ విషయంలో ఏదో గల్లంతు గత్తరతనం జరిగింది.

దీనింతటికీ కారణం పూర్తిగా పీఆర్ మ్యాజిక్ అనే అంటున్నారు. ఈ మ్యాజిక్ వల్లనే సినిమాకి బాగుందన్న టాక్ రావడం, ఇంకేముంది.. 70 కోట్లు వసూలు చేసేసింది.. అనే ప్రచారాలు జరిగాయ్.

అంతేకాదు, చాలావరకూ రివ్యూలు కూడా మ్యానేజ్ చేసేశారని, పాజిటివ్ రివ్యూలు రావడానికి కారణమిదే.. అన్న టాక్ కూడా ఇండస్ర్టీలో బలంగా వినిపించింది.

ఎప్పుడయితే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున వందమందికి కోటి రూపాయలు ఇస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించాడో సినిమా మళ్లీ ఊపందుకుంటుందని ‘ఖుషి’ టీమ్ భావించింది.

కానీ, అస్సలు లేవలేదు. కోటి రూపాయల ప్రకటనతో విజయ్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు కానీ, ధియేటర్‌కి వెళ్లి సినిమా చూసే సాహసం చేయట్లేదు ప్రేక్షకులు.