Keerthy Suresh: కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోని తట్టిల్ తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గోవాలో డిసెంబర్ 12వ తేదీ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక డిసెంబర్ 15వ తేదీ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇలా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే కీర్తి సురేష్ ఆంటోనీ వివాహ వేడుకలకు సంబంధించి కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు అలాగే సోషల్ మీడియాలో వీరి పెళ్లిని సమంత నాగచైతన్య పెళ్లితో పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. గతంలో నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా ప్రేమించుకుని గోవాలోనే వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ కూడా మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అనంతరం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎంతో ఘనంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే సమంత నాగచైతన్య తర్వాత ఇలా క్రిస్టియన్ హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎవరు పెళ్లి చేసుకోలేదు.
ఇలా సమంత నాగచైతన్య జంట తర్వాత కీర్తి సురేష్ ఆంటోనీ ఇద్దరు కూడా గోవాలోనే హిందూ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడంతో కొంతమంది వీరి పెళ్లిని సమంత నాగచైతన్య పెళ్లితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారా లేక వారిద్దరిలాగే విడాకులు తీసుకొని విడిపోతారా అంటూ పెళ్లయిన నాలుగు రోజులకే నెటిజన్స్ వీరి విడాకుల వరకు ఆలోచిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
