శివుడి ఫోటో ఇంట్లో ఉంచి పూజిస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

ఉంటారు. అయితే ఇలా పూజించేవాటిలో శివుడి ఫోటో కూడా చాలామంది ఇంటిలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు.అయితే శివుడి ఫోటో ఎవరైతే ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారో అలాంటివారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వాస్తు నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

శివుడి విగ్రహం లేదా చిత్రపటం ఇంట్లో ఉంచుకున్న వారు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. శివుడి నివాస స్థలం కైలాసం. కైలాసపర్వతం ఉత్తర దిశలో ఉంది కనుక మీరు కూడా ఇంట్లో శివుడి విగ్రహం లేదా చిత్రపటం పెట్టాలనుకుంటే ఉత్తర దిశలో పెట్టడం శుభప్రదం.వాస్తు శాస్త్రం ప్రకారం శివుడి ఫోటోలను ఇంట్లో కనుక పెట్టుకుంటే శివుడు ఉగ్రరూపం దాలుస్తూ తాండవం చేస్తున్నటువంటి ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు. ఇలాంటి ఫోటోలు ఇంట్లో ఉండటంవల్ల అది వినాశనానికి సంకేతంగా పరిగణించబడుతుంది.

ఇంట్లో ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుడు ధ్యాన రూపంలో ఉండి చిరునవ్వుతో కనిపించే ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం.అదేవిధంగా మనం ఇంట్లో శివుడి విగ్రహాన్ని పూజించే సమయంలో ఆ విగ్రహం ప్రతిష్టించే చోట ఏ విధమైనటువంటి అపరిశుభ్రత లేకుండా ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇక సోమవారం పరమేశ్వరుడికి బిల్వ దళాలతోనూ వివిధ రకాల పుష్పాలతో పూజించడం మంచిది.అయితే ఇంట్లో శివుడి విగ్రహాలు కనుక పెట్టుకుంటే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు అభిషేకాలు చేయాల్సి ఉంటుంది కనుక వీలైనంత వరకు చిన్న విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకోవడం మంచిది.