చేతిలో నొప్పిని కలిగించే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఈ వ్యాధి లక్షణాలు మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో కంప్యూటర్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది. అయితే చేతినొప్పి వల్ల చేతి వేళ్లలో నొప్పి వల్ల కంప్యూటర్ ను వినియోగించడం సాధ్యం కాకపోతే ఆ సమస్యను కర్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటారు. మణికట్టులోపలి ప్రదేశం వ్యాధిగ్రస్తమైతే ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాధి వల్ల చేతుల్లో తిమ్మిరి, మొద్దుబారటం, చేతి కండరాలు బలహీనపడటం జరుగుతుంది.

పురుషుల కంటే మహిళల్లో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. వ్యాధి ప్రారంభంలో రాత్రి సమయంలో లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిలో చిటికెను వేలులో మాత్రం లక్షణాలు కనిపించవు. వస్తువులను గట్టిగా పట్టుకున్న సమయంలో ఈ వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఉదయం పూట చేతివేళ్లు పట్టేసినట్టు ఉండటం కూడా ఈ వ్యాధి లక్షణమే అని చెప్పవచ్చు.

చేతులను సాగదీస్తూ చేసే వ్యాయామాల వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వేడి కాపడం, శీతలోపచారాలు వ్యాధి లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. వ్యాధి ప్రారంభంలోనే చికిత్స చేయించుకోవడం వల్లె మెరుగైన ఫలితాలను పొందవచ్చు. శక్తిని, కదలికలను మెరుగుపరిచే వ్యాయామాలను చేస్తే మంచిది. తక్కువ ఒత్తిడిని ఉపయోగించి టైప్ చేస్తే మంచిది.

బీ విటమిన్లు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేళ్లలో బలం తగ్గుతున్నట్టు అనిపిస్తే ఈ వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కొన్ని గృహ చికిత్సలు పాటించడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.