నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’ లో HIT ఆఫీసర్‌గా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. టీజర్ నాని క్యారెక్టర్ ని ఫెరోషియస్ అవతార్ లో ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ఫస్ట్ సింగిల్ – ప్రేమ వెల్లువ రిలీజ్ చేయడంతో ప్రారంభమైయింది.
మెలోడీ మాస్ట్రో మిక్కీ జె మేయర్ జంట నాని, శ్రీనిధి శెట్టిల అందమైన ప్రేమ ప్రయాణాన్ని ప్రజెంట్ చేసే రొమాంటిక్ బల్లాడ్‌ను కంపోజ్ చేశారు. నాని ప్రారంభంలో ఇంటెన్స్, దూకుడు స్వభావం వ్యక్తి. శ్రీనిధి రాకతో సాఫ్ట్ గా మారుతాడు. సాంగ్ ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా వుంది. లీడ్ పెయిర్ ఎమోషన్ ని బ్యూటీఫుల్ గా చూపించింది.
సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వోకల్స్ పాటకు మరింత మ్యాజిక్ ని యాడ్ చేసింది. నూతన మోహన్ వోకల్స్ సాంగ్ కు కంప్లీట్ నెస్ తీసుకొచ్చింది. లిరిక్ రైటర్ కృష్ణకాంత్ భావోద్వేగాలను అందంగా పొయిటిక్ గా ఎక్స్ ప్రెస్ చేసే సాహిత్యం రాశారు.
బీచ్ లీడ్ పెయిర్ ప్రేమకు సాక్షిగా కనిపించడం అద్భుతంగా వుంది. తుపాకీ ఆకారంలో బ్రిడ్జ్, వంతెన చివర్లో గులాబీ డిఫరెంట్ వ్యక్తిత్వాలకు మెటాఫర్ గా నిలిచింది. నాని శ్రీనిధికి దగ్గరగా రావడం, ముద్దు పెట్టిన రొమాంటిక్ గెస్చర్ లో సాంగ్ కి ఫినిషింగ్ ఇవ్వడం మెమరబుల్ గా వుంది.
నాని, శ్రీనిధి శెట్టిల కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. పరిణతి చెంది ప్రేమకథను ప్రజెంట్ చేసింది. మ్యజికల్ కంపోజిషన్, వోకల్స్, మరపురాని సాహిత్యంతో “ప్రేమ వెల్లువ” చార్ట్‌బస్టర్ సంచలనంగా మారడానికి అవసరమైన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనసుని గెలుచుకుని, చాలా కాలం పాటు నిలిచిపోయే పాట ఇది.
ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ డీవోపీగా పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
HIT ది 3rd కేస్ మే 1న విడుదల కానుంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్‌వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలర్స్: S రఘునాథ్ వర్మ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో