నెలరోజులు జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే.. ఈ హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా?

ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవికాలంలో జీలకర్ర నీరు తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, చర్మం మెరుస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీలకర్రలో ఉండే థైమోల్ అనే పదార్థం జీర్ణరసాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, దీనివల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

జీలకర్ర నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి, మొటిమలు, చర్మపు మచ్చలు తగ్గడానికి సహాయపడతాయి. జీలకర్ర నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

జీలకర్రలో ఉండే ఐరన్, పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జీలకర్ర నీరు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను రెండు కప్పుల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. తరువాత ఆ నీటిని వడకట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. అవసరమైతే రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి.

క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టడంలో కూడా జీలకర్ర సహాయపడుతుంది. వేసవికాలంలో జీలకర్ర నీరును ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఆయుర్వేదంలో సైతం జీలకర్ర నీరు ఎక్కువగా తీసుకుంటే లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. నెల రోజులు జీలకర్ర నీరు తాగడం వల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.