Akhil Wdding: అఖిల్ పెళ్లి విషయంలో సైలెంట్ అయిన అక్కినేని ఫ్యామిలీ… ఎందుకీ మౌనం!

Akhil Wdding: అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వారిలో నటుడు అఖిల్ అక్కినేని ఒకరు. ఈయన అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఇప్పటివరకు అఖిల్ నటించిన ఒక సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి తద్వారా అఖిల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈయన చివరిగా ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అఖిల్ త్వరలోనే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమాలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈయన కెరియర్ విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… అఖిల్ ఇదివరకే శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరు కొన్ని కారణాలవల్ల తమ నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.

ఇకపోతే అఖిల్ మరోసారి జైనాబ్ అనే అమ్మాయి ప్రేమలో పడ్డారు. అయితే ఈమె తండ్రి అక్కినేని కుటుంబానికి చాలా సన్నిహితులు కావడంతో వీరిద్దరి నిశ్చితార్థం పెద్దల సమక్షంలో జరిగింది. అయితే అఖిల్ పెళ్లి గురించి ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి విషయాన్ని అక్కినేని కుటుంబం అధికారకంగా వెల్లడించలేదు కానీ ఈయన పెళ్లి మార్చిలోనే జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా మార్చిలో అఖిల్ వివాహం జరగబోతుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ పెళ్లి విషయంలో మాత్రం అక్కినేని కుటుంబం చాలా మౌనంగా ఉంటుంది. ఎక్కడ కూడా పెళ్లి హడావిడి కనిపించలేదు దీంతో అభిమానులు అఖిల్ పెళ్లి విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఈయన పెళ్లికి మరి కాస్త సమయం ఉన్న నేపథ్యంలోనే సైలెంట్ గా ఉన్నారా లేకపోతే చాలా సింపుల్గా ఈయన వివాహాన్ని చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.