ఈ డ్రింక్స్ తాగితే అలసట అస్సలు రాదట.. వేసవికాలంలో వీటితో ఎన్నో లాభాలు!

అలసటను తగ్గించడానికి, మంచి నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, మరియు తగినంత నీరు త్రాగడం వంటివి చేయాలి. అలసటగా అనిపిస్తే అలసట రావడానికి ప్రధానమైన కారణాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరాత్రి 7 – 8 గంటల నిద్ర ఆరోగ్యానికి ముఖ్యం అని చెప్పవచ్చు. నిద్ర సమయం మరియు మేల్కొనే సమయం రెగ్యులర్ గా ఉండేలా చూసుకోవాలి.

నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్ ను నివారిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకునే ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, మరియు గింజలు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా అలసట తగ్గుతుంది. వ్యాయామం ద్వారా శక్తి స్థాయిలు పెరుగుతాయని చెప్పవచ్చు. దోసకాయ జ్యూస్ అలసట, ఒత్తిడిని తగ్గించడంలో సహయపడుతుంది. ద్రాక్ష రసం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు అలసటను దూరం చేసే అవకాశాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు తీసుకోవడం ద్వారా కూడా అలసటకు చెక్ పెట్టవచ్చు.

నిమ్మరసం ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా అలసటకు చెక్ పెట్టే అవకాశాలుంటాయి. చియా సీడ్స్ తీసుకుంటే అలసట శాశ్వతంగా దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. అలసటను ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరం చేయడంలో ఈ చిట్కాలు సహాయపడతాయి.