ట్రాఫిక్ రూల్ ఫాలో కాకపోతే, ఈ మహిళా పోలీస్ ఎంచేసిందో చూడండి (వీడియో)

ఈ గుజరాత్ మహిళా పోలీసధికారి సాహసం చూడండి. ఒక మహిళా స్కూటరిస్టు ట్రాఫిక్ రూల్ అతిక్రమించి కాన్ స్టేబుల్ కళ్లు గప్పి పారి పోవాలని చూసింది. అయితే, ఈ పోలీసు అంత వీజీగా వదిలేరకం. రూల్ అతిక్రమించాక శిక్ష తప్పదు. దానికి తోడు పారిపోవానుకుంది. అంతే, స్కూటర్ వెంటబడింది. స్కూటర్ వెనక బార్ పట్టుకుని పరిగెత్తింది. స్కూటరిస్టు అయినా సరే పోవాలనే చూసింది. కుదర్లేదు. చివరకు స్కూటరాపి కూడా వాగ్వాదానికి దిగింది. అదంతా కుదరదు ముందు బండాపు అనేసింది. ఈ వీడియో ఇపుడు వైరల్.